Krishna: సూపర్ స్టార్ కృష్ణతో ఏకంగా 45 చిత్రాల్లో నటించిన హీరోయిన్ ఈమే!

Jayaprada acted in 45 films with Krishna
  • కృష్ణతో 45 సినిమాల్లో నటించిన జయప్రద
  • 'శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్' వీరి తొలి చిత్రం 
  • టాలీవుడ్ కు ఎన్నో హిట్ చిత్రాలను అందించిన అందమైన జంట

సూపర్ స్టార్ కృష్ణ మృతితో టాలీవుడ్ మూగబోయింది. తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో మార్పులకు నాంది పలికిన ఆంధ్ర జేమ్స్ బాండ్ మృతితో సినీ పరిశ్రమ షాక్ కు గురయింది. మరోవైపు, తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో చిత్రాల్లో నటించిన కృష్ణ ఎందరో హీరోయిన్లకు లైఫ్ ఇచ్చారు. ముఖ్యంగా ఆయన సరసన ఎక్కువ సినిమాల్లో చేసిన ఘనత జయప్రదదే. కృష్ణతో కలిసి ఆమె ఏకంగా 45 చిత్రాల్లో నటించారు. ఒక హీరోతో ఓ హీరోయిన్ ఇన్ని చిత్రాల్లో నటించడం ఓ రికార్డు. ఆ ఘనత జయప్రదకే దక్కింది. 

ఎన్నో సందర్భాల్లో కృష్ణ తనకు అందించిన సహకారం గురించి జయప్రద గుర్తు చేసుకున్నారు. తాను పరిశ్రమలో అడుగుపెట్టినప్పుడు కృష్ణ తనకు ఎంతో సపోర్ట్ ఇచ్చారని ఆమె చెపుతుంటారు. బాపు దర్శకత్వం వహించిన విజయా సంస్థ నిర్మించిన 'శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్' చిత్రంలో కృష్ణ సరసన జయప్రద తొలిసారి నటించారు. ఈ చిత్రం ఊహించినంత విజయం సాధించలేనప్పటికీ కృష్ణ ఆమెకు అండగా నిలిచారు. తన తదుపరి చిత్రాల్లో వరుస ఆఫర్లు ఇస్తూ ఆమెను స్టార్ హీరోయిన్ ను చేశారు. వీరి కాంబినేషన్లో ఎన్నో హిట్ చిత్రాలు వచ్చాయి. వీరి కాంబినేషన్లో వచ్చిన పాటలు ఇప్పటికీ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుంటాయి.

  • Loading...

More Telugu News