Chandrababu: ఉప్పలపాడులో ఎన్టీఆర్ విగ్రహంపై దుండగుల దుశ్చర్యను ఖండిస్తున్నాను: చంద్రబాబు

Chandrababu condemns Chappals tied to NTR statue in Guntur district
  • గుంటూరు జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహానికి చెప్పులు కట్టిన వైనం
  • స్పందించిన చంద్రబాబు
  • గొప్పవ్యక్తులను గౌరవించుకునే సంస్కృతికి వైసీపీ దూరమని విమర్శలు
  • ప్రభుత్వం వక్రబుద్ధి మార్చుకోవాలని హితవు
గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలో ఎన్టీఆర్ విగ్రహానికి చెప్పులు కట్టడంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. ఉప్పలపాడులో ఎన్టీఆర్ విగ్రహంపై దుండగుల దుశ్చర్యను ఖండిస్తున్నానని తెలిపారు. 

మహనీయులను గౌరవించుకునే మంచి సంస్కృతికి వైసీపీ మొదటి నుంచి దూరంగానే ఉంటోందని విమర్శించారు. సంస్థలకు ఉన్న నాయకుల పేర్ల మార్పు, విగ్రహాల తొలగింపు వంటి చర్యలకు ప్రభుత్వమే పాల్పడుతుండడంతో, ఆ పార్టీ క్యాడర్ కూడా అదే దారిలో వెళుతోందని వివరించారు. 

వక్రబుద్ధితో వ్యవహరించే ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలని చంద్రబాబు హితవు పలికారు. అదే సమయంలో, ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్న వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.
Chandrababu
NTR Statue
Uppalapadu
Guntur District
TDP
Andhra Pradesh

More Telugu News