ముంబయిలో కలిసిన 80వ దశకం తారలు... ఆతిథ్యమిచ్చిన జాకీష్రాఫ్, పూనమ్ థిల్లాన్
- ప్రతి ఏడాది కలుస్తున్న సీనియర్ తారలు
- క్రమం తప్పకుండా హాజరవుతున్న చిరంజీవి తదితరులు
- ఈసారి ముంబయిలో సంబరాలు
- దక్షిణాది తారలకు జత కలిసిన బాలీవుడ్ సీనియర్లు
ఈ ఏడాది వీరి కలయికకు ముంబయి వేదికగా నిలిచింది. ఈసారి వీరికి బాలీవుడ్ సీనియర్ తారలు కూడా జత కలిశారు. ఈ ఆహ్లాదకర వేడుకకు బాలీవుడ్ స్టార్లు జాకీష్రాఫ్, పూనమ్ థిల్లాన్ ఆతిథ్యమిచ్చారు.
అంతేకాదు, ఈ సంబరాల్లో అనుపమ్ ఖేర్, అనిల్ కపూర్, మీనాక్షి శేషాద్రి, విద్యాబాలన్ తదితరులు కూడా పాల్గొన్నారు. వీరందరూ ఉల్లాసంగా ఆడిపాడారు. విందు వినోదాలతో ఆనందంగా గడిపారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కాగా, 80వ దశకం తారలు ఇలా కలవడం ఇది 11వ సారి.