boxing: ఆసియా బాక్సింగ్ లో పతకం నెగ్గిన తెలంగాణ బాక్సర్ హుస్సాముద్దీన్

  • సెమీస్ చేరడం ద్వారా కాంస్యం గెలిచిన హుస్సామ్
  • క్వార్టర్స్ లో గాయం అవ్వడంతో సెమీ ఫైనల్ కు గైర్హాజరు
  • ఈ టోర్నీలో ఫైనల్ చేరిన ఆరుగురు భారత బాక్సర్లు
Telangana boxer Hussamuddin secures  medal in Asian Boxing

జోర్డాన్ లో జరుగుతున్న ఆసియా ఎలైట్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాక్సర్ మహ్మద్ హుస్సాముద్దీన్ కాంస్య పతకం గెలిచాడు. పురుషుల 57 కిలోల విభాగం సెమీఫైనల్ చేరడం ద్వారా అతను ఈ పతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. క్వార్టర్ ఫైనల్ బౌట్ లో హుస్సామ్ కుడి కంటి పైభాగంలో గాయం అయ్యింది. దాంతో, అతను సెమీఫైనల్ కు గైర్హాజరయ్యాడు. అతని ప్రత్యర్థికి వాకోవర్ ఇచ్చేశాడు. హుస్సామ్ కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. మరోవైపు ఈ టోర్నీలో భారత్ నుంచి ఆరుగురు బాక్సర్లు ఫైనల్ కి దూసుకెళ్లారు. 

పురుషుల 63.5 కిలోల విభాగంలో పోటీ పడుతున్న స్టార్ బాక్సర్ శివ థాపా రికార్డు స్థాయిలో ఆరో పతకం ఖాయం చేసుకున్నాడు. సెమీఫైనల్లో అతను 4-1తో బకోదుర్‌ ఉస్మానోవ్‌ (తజకిస్థాన్‌)పై నెగ్గాడు. పురుషుల 48 కిలోల సెమీస్‌లో గోవింద్‌ 0–4తో సాంజర్‌ తాష్కెన్‌బే (కజకిస్థాన్‌) చేతిలో, 75 కిలోల విభాగంలో సుమిత్‌ 0–5తో జఫరోవ్‌ (ఉజ్బెకిస్థాన్‌) చేతిలో ఓడి కాంస్య పతకాలతో తిరిగొచ్చారు. మహిళల విభాగంలో ఒలింపిక్ పతక విజేత లవ్లీనా బొర్గోహైన్ సహా ఐదుగురు ఫైనల్ చేరి కనీసం రజత పతకాలు ఖాయం చేసుకున్నారు. ఈ రోజు మహిళల విభాగం ఫైనల్స్, రేపు పురుషుల ఫైనల్స్ జరుగుతాయి.

More Telugu News