రిపోర్టర్ తో డేటింగ్ చేస్తున్న బిల్ గేట్స్ మాజీ భార్య
- 27 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికిన బిల్ గేట్స్, మిలిందా
- మాజీ టీవీ రిపోర్టర్ జాన్ తో మిలిందా డేటింగ్ చేస్తోందంటూ వార్తలు
- ఇప్పటికే పలుమార్లు మీడియాకు చిక్కిన ప్రేమ జంట
58 ఏళ్ల మిలిందా 60 ఏళ్ల మాజీ టీవీ రిపోర్టర్ జాన్ డ్యూ ప్రీతో డేటింగ్ చేస్తోందనే వార్త వైరల్ అవుతోంది. కొంత కాలంగా వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారని ఓ ఆన్ లైన్ మీడియా సంస్థ తన కథనంలో తెలిపింది. వీరిద్దరూ కలిసి ఇప్పటికే పలు మార్లు మీడియా కంటికి చిక్కారు. మరోవైపు, ఈ కథనాలపై మిలిందా కానీ, జాన్ డ్యూ ప్రీ కానీ ఇంతవరకు స్పందించలేదు. దీంతో, ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్టయింది. మరోవైపు, బిల్ గేట్స్, మిలిందాకు ముగ్గురు సంతానం ఉన్నారు.
మిలిందా .. జాన్ డ్యూ ప్రీ