Madhya Pradesh: శ్రీకృష్ణుడితో కుమార్తెకు వివాహం జరిపించిన తండ్రి.. హాజరైన బంధుమిత్రులు.. వీడియో ఇదిగో!

 Specially abled girl marries Lord Krishna in Gwalior
  • మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఘటన
  • 21 ఏళ్లుగా చక్రాల కుర్చీకే పరిమితమైన కుమార్తె
  • పెద్ద ఎత్తున హాజరైన బంధుమిత్రులు
ఓ తండ్రి తన కుమార్తెను శ్రీకృష్ణ భగవానుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. ఈ పెళ్లికి బంధుమిత్రులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారిన ఈ వివాహం వెనక ఆ తండ్రి ఆవేదన ఉంది. గుండెల్లో చెప్పలేనంత బాధ ఉంది. 

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శివపాల్ అనే వ్యాపారవేత్తకు దివ్యాంగురాలైన కుమార్తె ఉంది. ఆమె మాట్లాడలేదు, చెవులు వినబడవు. 21 ఏళ్లుగా చక్రాల కుర్చీకే పరిమితమైన కుమార్తెను శివపాల్ ఎంతో ఆప్యాయంగా చూసుకుంటున్నాడు. కుమార్తెకు వివాహం జరగడం ఇక కాని పని అని నిర్ణయించుకున్న ఆయన.. తన కుమార్తెను శ్రీకృష్ణ భగవానుడికి ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించాడు.

అనుకున్నదే ఆలస్యం.. కుమార్తెకు వివాహం నిశ్చయించామని, తప్పకుండా రావాలంటూ బంధుమిత్రులకు ఫోన్లు చేసి ఆహ్వానించాడు. శ్రీకృష్ణుడితో వివాహం అనగానే అందరూ ఆశ్చర్యపోయారు. అయినప్పటికీ అందరూ వివాహానికి హాజరయ్యారు. పెళ్లికి ముందు మామూలుగానే మెహందీ వేడుక, విందు, ఊరేగింపు నిర్వహించారు. ఓ ఆలయంలో జరిగిన ఈ పెళ్లిలో శ్రీకృష్ణుడి వేషధారణలో ఉన్న అమ్మాయి, వధువు పూలదండలు మార్చుకున్నారు. పెళ్లికి హాజరైన బంధుమిత్రులు వారిని ఆశీర్వదించారు. ఘనంగా జరిగిన ఈ పెళ్లి వేడుక ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమైంది.
Madhya Pradesh
Gwalior
Specially Abled Girl
Lord Krishna

More Telugu News