మరో రికార్డు సాధించిన తెలంగాణ... దేశంలోనే అతిపెద్ద ఐస్ క్రీమ్ తయారీదారుగా అవతరించిన వైనం
- జహీరాబాద్ ప్లాంట్ లో ఉత్పత్తిని ప్రారంభించిన హాట్సన్
- రోజుకు 100 టన్నుల ఐస్ క్రీమ్ ను ఉత్పత్తి చేయనున్న సంస్థ
- దీనికి అదనంగా రోజుకు 7 టన్నుల చాకొలెట్ల ఉత్పత్తి కూడా
- రూ.400 కోట్లతో జహీరాబాద్ ప్లాంట్ ను ఏర్పాటు చేసిన హాట్సన్
రూ.400 కోట్ల పెట్టుబడితో హాట్సన్ జహీరాబాద్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ యూనిట్ లో ఆ సంస్థ రోజుకు 7 టన్నుల చాకొలెట్లతో పాటు 100 టన్నుల ఐస్ క్రీమ్ ను ఉత్పత్తి చేయనుంది. తద్వారా ఐస్ క్రీమ్ తయారీలో తెలంగాణను ఆ సంస్థ దేశంలోనే అతిపెద్ద తయారీదారుగా నిలిపింది. అరుణ్ ఐస్ క్రీమ్, ఐబాకో పేరిట హాట్సన్ ఐస్ క్రీమ్ లను ఉత్పత్తి చేస్తోంది. ఈ యూనిట్ కోసం హాట్సన్ కంపెనీ రాష్ట్రంలోని 5 వేల మంది పాల ఉత్పత్తిదారుల నుంచి రోజుకు 10 లక్షల లీటర్ల పాలను సేకరిస్తోందని కేటీఆర్ తెలిపారు.