Stock Market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • 152 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 45 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
  • 4 శాతానికి పైగా పతనమైన పవర్ గ్రిడ్ షేర్ విలువ
Markets ends in losses

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన మార్కెట్లు.... కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. అమెరికా, యూకే ఫ్యూచర్స్ నష్టాల్లోకి జారుకోవడం మన మార్కెట్లపై ప్రభావం చూపింది. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 152 పాయంట్లు కోల్పోయి 61,033కి పడిపోయింది. నిఫ్టీ 45 పాయింట్లు కోల్పోయి 18,157 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఐటీసీ (1.99%), డాక్టర్ రెడ్డీస్ (1.22%), కోటక్ బ్యాంక్ (0.71%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (0.56%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (0.44%).

టాప్ లూజర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-4.06%), టెక్ మహీంద్రా (-2.32%), సన్ ఫార్మా (-1.49%), బజాజ్ ఫిన్ సర్వ్ (-1.35%), ఎన్టీపీసీ (-1.34%).

More Telugu News