ఎన్టీఆర్ తో సినిమాపై స్పందించిన 'కాంతార' హీరో!
- 'కాంతార' సినిమాతో రిషబ్ శెట్టికి క్రేజ్
- తెలుగులోను గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా
- ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నట్టు ప్రచారం
- అలాంటిదేం లేదని చెప్పిన రిషబ్
ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ హీరోగా ఆయన ఒక సినిమా చేయనున్నాడనే టాక్ కొన్నిరోజులుగా బలంగా వినిపిస్తోంది. హీరోగానే కాదు దర్శకుడిగా కూడా రిషబ్ శెట్టికి మంచి ట్రాక్ రికార్డు ఉండటం .. టాలీవుడ్ లో తన ఫేవరేట్ హీరో ఎన్టీఆర్ అని ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పడం ఈ ప్రచారారానికి మరింత బలాన్నిచ్చింది.
తాజాగా ఈ ప్రచారాన్ని గురించి రిషబ్ శెట్టి స్పందిస్తూ, "ఎన్టీఆర్ తో ఒక సినిమా చేసే ఛాన్స్ వస్తే అంతకంటే కావల్సిందేముంటుంది? కాకపోతే నేను ముందుగా కథను రెడీ చేసుకుని ఆ తరువాతనే అందుకు తగిన హీరోలను సంప్రదిస్తూ ఉంటాను. ఎన్టీఆర్ కి తగిన కథ సిద్ధమైనప్పుడు తప్పకుండా ఆయనను కలుస్తాను. ప్రస్తుతానికైతే అలాంటి కథలేవీలే నా దగ్గర లేవు" అంటూ ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశాడు.