Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పదో రౌండ్ లో 'కారు'కు స్వల్ప ఆధిక్యం

TRS gets slight lead in tenth round
  • కొనసాగుతున్న మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్
  • పదో రౌండ్ లో టీఆర్ఎస్ కు 484 ఓట్ల ఆధిక్యం
  • 4,407 ఓట్లకు పెరిగిన లీడ్
  • ముందంజలో టీఆర్ఎస్ పార్టీ
మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ లో టీఆర్ఎస్ ముందంజలో ఉంది. పదో రౌండ్ లో టీఆర్ఎస్ కు 484 ఓట్ల స్వల్ప ఆధిక్యం లభించింది. ఈ రౌండ్ లో టీఆర్ఎస్ కు 7,499 ఓట్లు లభించగా, బీజేపీకి 7,015 ఓట్లు వచ్చాయి. 

మొత్తం 10 రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ పార్టీ లీడ్ 4,407 ఓట్లకు చేరింది. ఇప్పటివరకు టీఆర్ఎస్ కు మొత్తం 67,330 ఓట్లు, బీజేపీకి 62,923 ఓట్లు, కాంగ్రెస్ కు 14,596 ఓట్లు లభించాయి. మరో ఐదు రౌండ్ల కౌంటింగ్ మిగిలున్న నేపథ్యంలో మరికాసేట్లో మునుగోడు ఉప ఎన్నిక ఫలితం వెలువడనుంది.
TRS
Leading
Munugode
Counting
BJP
Congress

More Telugu News