Gangula Kamalakar: రాష్ట్ర ఆదాయాన్ని పెంచి.. సంపదను పేదలకు పంచడమే కేసీఆర్ లక్ష్యం: గంగుల

  • కేసీఆర్ ఎన్నో గొప్ప పథకాలను అమలు చేశారన్న గంగుల
  • పేదింటి అమ్మాయిల పెళ్లిళ్లకు అండగా నిలుస్తున్నారని కితాబు
  • పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్న మంత్రి
Gagula praises KCR

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని పెంచి, ఆ సంపదను పేద ప్రజలకు పంచాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ అర్బన్, కొత్తపల్లి మండలాలకు చెందిన 142 మంది కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు ఈరోజు రూ. 1,42,16,472లను పంపిణీ చేశారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎన్నో గొప్ప పథకాలను కేసీఆర్ అమలు చేశారని చెప్పారు. రైతులకు ఉచిత విద్యుత్, రైతుబంధు, సాగునీరు అందిస్తున్న ఘనత కేసీఆర్ దని అన్నారు. 

పేదింటి అమ్మాయిల వివాహాలకు అండగా నిలవాలనే ఆలోచన రావడమే చాలా గొప్ప అని చెప్పారు. అన్నగా, మేనమామగా పేద ఆడబిడ్డలకు అండగా ఉండేందుకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. పేద ఆడబిడ్డలకు పెళ్లయిన నెల రోజుల్లోనే చెక్కులు అందిస్తున్నామని చెప్పారు. ఉన్నత వర్గాలకు దీటుగా మహాత్మా జ్యోతిబాపూలే గురుకులాల్లో ప్రతి పేది విద్యార్థికి సంవత్సరానికి రూ. 1.25 లక్షలు వెచ్చింది నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు.

More Telugu News