కూల్చి పారదొబ్బడానికి ఇది సినిమా సెట్టింగ్ కాదు: పవన్ కల్యాణ్ పై అంబటి రాంబాబు సెటైర్

  • ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతపై విపక్షాల మండిపాటు
  • ఇడుపులపాయలో హైవే వేస్తామంటూ పవన్ వ్యాఖ్య
  • ఇది సినిమా షూటింగ్ కాదన్న అంబటి  
మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో రోడ్డు వెడల్పు పేరుతో ఇళ్లను కూల్చడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. దెబ్బతిన్న రోడ్లను తయారు చేయడం చేత కాదు కానీ... రోడ్లు వెడల్పు చేస్తారా? అంటూ జనసేనాని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇడుపులపాయపై హైవే వేస్తామంటూ హెచ్చరించారు. జనసేన సభను నిర్వహించుకోవడానికి స్థలం ఇచ్చారనే అక్కసుతోనే ఇళ్లను కూల్చేశారని మండిపడ్డారు. మరోవైపు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు సెటైర్ వేశారు. 'ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. కూల్చి పారదొబ్బడానికి ఇది సినిమా సెట్టింగు కాదు, షూటింగ్ కాదు పవన్ కల్యాణ్' అని ట్వీట్ చేశారు.

Ambati Rambabu
YSRCP
Pawan Kalyan
Janasena

More Telugu News