నా భార్యకు టీవీ నటుడితో వివాహేతర సంబంధం ఉంది: సుస్మితాసేన్‌ సోదరుడు రాజీవ్‌సేన్‌

Sushmita Sen brother alleges that his wife has illegal contact with actor Karan Mehra
  • తన భార్య చారు అసోపాకు కరణ్ మెహ్రాతో సంబంధం ఉందన్న రాజీవ్
  • తనను మానసికంగా హింసించిన చారును క్షమించబోనని వ్యాఖ్య
  • ఆమెను ఒక వ్యక్తిగా ఎంతో గౌరవించానన్న రాజీవ్
మాజీ విశ్వ సుందరి, ప్రముఖ సినీ నటి సుస్మితాసేన్ సోదరుడు రాజీవ్ సేన్ తన భార్య చారు అసోపా గురించి తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమెకు ప్రముఖ టీవీ నటుడు కరణ్ మెహ్రాతో వివాహేతర సంబంధం ఉందని చెప్పారు. ఆమెను ఒక వ్యక్తిగా ఎంతో గౌరవంగా చూశానని.. అయితే ఆమె మాత్రం మహిళా కార్డును వాడుతూ తనను వేధించిందని అన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిందని చెప్పారు. తనపై ఆమె తీవ్ర ఆరోపణలు చేసినప్పటికీ... తన కుటుంబ సభ్యులు మాత్రం ఆమెనే ఎక్కువ ప్రేమగా చూశారని అన్నారు. తనను ఎంతో అవమానించి, మానసికంగా హింసించిన చారును ఎప్పటికీ క్షమించబోనని చెప్పారు. 

చారు తల్లి తనకు వాయిస్ నోట్స్ పంపిందని... చారుకు, కరణ్ కు మధ్య వివేహేతర సంబంధం ఉందని చెప్పడానికి ఆ నోట్స్ సాక్ష్యమని తెలిపారు. తన భర్తకు పర స్త్రీలతో సబంధాలు ఉన్నాయని ఇటీవలే చారు అసోపా ఆరోపించారు. దీంతో, తాజాగా తన భార్యపై ఆయన ఆరోపణలు గుప్పించారు.
Go Back to Shorts
Sushmita Sen
Brother
Rajiv Sen
Wife

More Telugu News