ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం.. మూతపడ్డ పాఠశాలలు
- ప్రమాదకర స్థాయికి చేరుకున్న వాయు కాలుష్యం
- ఈ నెల 8 వరకు ఆన్ లైన్ లో క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశం
- పాఠశాలల్లో క్రీడలను కొంతకాల నిషేధించాలని యాజమాన్యాల నిర్ణయం
ఈ నేపథ్యంలో ఢిల్లీ, నోయిడా పరిధిలో పాఠశాలలు ఆన్ లైన్ బోధన ప్రారంభించాయి. ఢిల్లీ ప్రభుత్వం ఈ నెల 8వ తేదీ వరకు అన్ లైన్ క్లాసులు నిర్వహించాలని నిర్ణయించింది. అలాగే, విద్యార్థుల ఆరోగ్య సంరక్షణపై పాఠశాలల యాజమాన్యాలు దృష్టి సారించాయి. గాలి నాణ్యత మెరుగయ్యే వరకు పాఠశాలల ప్రాంగణాల్లో చిన్నారుల ఆటపాటలను నిలిపివేయాలని నిర్ణయించాయి. మరికొన్ని స్కూళ్లలో ఎయిర్ ప్యూరిఫయర్స్, వైద్య సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాయి.