అయ్యన్న అరెస్ట్ నేపథ్యంలో.. ఏపీ వ్యాప్తంగా టీడీపీ శ్రేణుల ఆందోళనలు
- అయ్యన్న, ఆయన కుమారుడిని అదుపులోకి తీసుకున్న సీఐడీ పోలీసులు
- నిరసన కార్యక్రమాలను చేపట్టిన టీడీపీ శ్రేణులు
- అయ్యన్నను వెంటనే విడుదల చేయాలని డిమాండ్
మరోవైపు అయ్యన్నను అరెస్ట్ చేయడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగాయి. నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపులను పాల్పడుతోందని నినాదాలు చేస్తున్నారు. అయ్యన్నను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనకు దిగిన టీడీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఎక్కడికక్కడ వారిని అదుపులోకి తీసుకుని, అక్కడి నుంచి తరలిస్తున్నారు.