Joe Biden: అమెరికా ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోంది: జో బైడెన్‌

Democracy being attacked un USA says Joe Biden
  • అధికారం కోసం రాజకీయ హింసను వ్యాపింపచేస్తున్నారని విమర్శ
  • ద్వేషం, హింసను ప్రేరేపించడానికి పదేపదే అబద్ధాలను చెపుతున్నారని మండిపాటు
  • అబద్ధాలను నిజంతో ఎదుర్కోవాలన్న బైడెన్
అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి జరుగుతోందని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. పరోక్షంగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై విమర్శలు గుప్పించారు. అధికారం కోసం స్వార్థం కోసం రాజకీయ హింసను వ్యాపింపచేస్తున్నారని అన్నారు. కోపం, ద్వేషం, హింసను ప్రేరేపించడానికి పదేపదే అబద్ధాలను చెపుతున్నారని విమర్శించారు. ఈ అబద్ధాలను నిజంతో ఎదుర్కొవాలని... దీనిపైనే మన దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని చెప్పారు. రిపబ్లికన్లు అయినా, డెమోక్రాట్లు అయినా ఓటర్లపై బెదిరింపులకు, రాజకీయ హింసకు దారి లేదని అన్నారు. వైట్ హౌస్ లో రాజకీయ హింస, ప్రజాస్వామ్యానికి బెదిరింపులు అన్న అంశంపై మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Joe Biden
USA
Democracy

More Telugu News