అయ్యన్న అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించిన చంద్రబాబు
- గోడలు దూకి, తలుపులు బద్దలుగొట్టి అరెస్టులేంటని చంద్రబాబు ప్రశ్న
- అయ్యన్న, రాజేశ్‌ల అరెస్ట్‌లు తనను దిగ్భ్రాంతికి గురిచేశాయన్న టీడీపీ అధినేత
- వైసీపీ ఉత్తరాంధ్ర దోపిడీని ప్రశ్నిస్తున్నందుకే బీసీ నేతపై కేసులని విమర్శ
- వెంటనే వారిద్దరినీ విడుదల చేయాలని డిమాండ్
చింతకాయల విజయ్‌పై కేసు విషయంలో సీఐడీ విధానాలను కోర్టు తప్పు పట్టినా పోలీసులు మారలేదని అన్నారు. పోలీసులు దొంగల్లా ఇళ్ల మీద పడి అరెస్టులు చేస్తున్నారని, ఇలాంటి పరిస్థితులు గతంలో ఉన్నాయా? అని ప్రశ్నించారు. వైసీపీ ఉత్తరాంధ్ర దోపిడీని ప్రశ్నిస్తున్న బీసీ నేతల గళాన్ని అణచివేసేందుకే కేసులు, అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. అయ్యన్న, ఆయన కుమారుడు రాజేశ్‌లను వెంటనే విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.