Chandrababu: వచ్చే మే నెల, లేదా డిసెంబరులో ఎన్నికలు రావొచ్చని చర్చ జరుగుతోంది: చంద్రబాబు

Chandrababu predicts elections will be in next year May or December
  • ఎన్టీఆర్ జిల్లా టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం
  • బాదుడే బాదుడు కార్యక్రమంపై చర్చ
  • ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చన్న చంద్రబాబు
  • నేతలు సంసిద్ధంగా ఉండాలని పిలుపు
టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్టీఆర్ జిల్లా నేతలతో సమావేశమయ్యారు. ఈ నెల 4వ తేదీన ఎన్టీఆర్ జిల్లాలో నిర్వహించనున్న 'బాదుడే బాదుడు' కార్యక్రమంపై నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని అన్నారు. వచ్చే మే నెల, లేదా డిసెంబరులో ఎన్నికలు జరగొచ్చని చర్చ జరుగుతోందని తెలిపారు. 

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు పార్టీలో ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. నేతలంతా ప్రజల్లోనే ఉండాలని స్పష్టం చేశారు. తాను కూడా ప్రజల్లో ఉండేలా కార్యాచరణ రూపొందించుకుంటున్నట్టు చంద్రబాబు వెల్లడించారు.
Chandrababu
Elections
TDP
Andhra Pradesh

More Telugu News