Kakinada SP: సీఎం జగన్ కార్యాలయం వద్ద మహిళ ఆత్మహత్యాయత్నం ఘటనపై కాకినాడ ఎస్పీ వివరణ

Kakinada SP responds to woman allegations on police personnel
  • తాడేపల్లిలో మహిళ ఆత్మహత్యాయత్నం కలకలం 
  • బ్లేడుతో మణికట్టు వద్ద కోసుకున్న ఆరుద్ర
  • మంత్రి దాడిశెట్టి గన్ మన్, మరో కానిస్టేబుల్ పై ఆరోపణలు
  • స్పందించిన కాకినాడ ఎస్పీ కార్యాలయం
తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆరుద్ర అనే మహిళ తమకు న్యాయం చేయాలంటూ ఆత్మహత్యాయత్నం చేయడం తెలిసిందే. మంత్రి దాడిశెట్టి రాజా గన్ మన్, మరో పోలీసు కానిస్టేబుల్ పై ఆమె ఆరోపణలు చేసిన నేపథ్యంలో కాకినాడ ఎస్పీ వివరణ ఇచ్చారు. 

అన్నవరంలోని తన ఇల్లు విక్రయం విషయంలో ఆరుద్ర కేసు పెట్టారని వెల్లడించారు. ఈ కేసులో కానిస్టేబుళ్లు శివ, కన్నయ్యతో పాటు మరో ఇద్దరిపైనా ఆరోపణలు చేశారని తెలిపారు. ఈ వివాదంలో ఇరువర్గాలకు కౌన్సెలింగ్ ఇచ్చామని ఎస్పీ వివరించారు. 

అటు, ఆరుద్ర, ఆమె భర్త, మరో వ్యక్తిపై కానిస్టేబుల్ తల్లి శివ కేసు పెట్టారని వెల్లడించారు. మంత్రి దాడిశెట్టి రాజా గన్ మన్ కన్నయ్యను గతంలోనే తప్పించామని స్పష్టం చేశారు. ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న శివను వెనక్కి పిలిపించామని ఎస్పీ తెలిపారు. అన్నవరం పోలీసులు రెండు కేసులనూ విచారిస్తున్నారని వివరించారు.
Kakinada SP
Arudra
Police
CM Camp Office

More Telugu News