మద్యానికి బానిసై సీసాలను ఎత్తుకెళ్లి తాగేస్తున్న కోతి.. వీడియో ఇదిగో!
- ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి జిల్లాలో ఘటన
- జనం చేతుల్లోంచి మద్యం సీసాలను లాక్కుంటున్న కోతి
- ఎదిరిస్తే దాడి చేస్తున్న వానరం
- బంధించేందుకు అటవీశాఖ అధికారుల యత్నం
కోతి ఆగడాలపై మద్యం వ్యాపారులు, వినియోగదారుల నుంచి ఫిర్యాదులు అందుకున్న జిల్లా ఎక్సైజ్ అధికారి రాజేంద్ర ప్రసాద్ సింగ్ మాట్లాడుతూ.. అటవీ అధికారుల సాయంతో కోతిని బంధించేందుకు ప్రయత్నిస్తామన్నారు.
కాగా, లక్నో-కాన్పూరు రోడ్డులోని నవాబ్‌గంజ్ ప్రాంతంలోనూ ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. అక్కడ ఓ కోతి లిక్కర్ షాపునకు పర్మనెంట్ కస్టమర్‌గా మారింది. చిల్ల్డ్ బీరుపై మనసు పారేసుకున్న ఈ వానరానికి ఓ కస్టమర్ ప్రతి రోజు బీర్ బాటిల్ కొనిచ్చేవాడు. ఆ తర్వాత ఆ వానరం కాలేయం పెరిగి చనిపోయింది.