అలెక్స్ హేల్స్ దూకుడు... కివీస్ పై భారీ స్కోరు దిశగా ఇంగ్లండ్

England eyes on huge total against Kiwis
టీ20 వరల్డ్ కప్ లో ఇవాళ ఆసక్తికర సమరం జరుగుతోంది. బ్రిస్బేన్ లోని గబ్బా మైదానంలో ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. సూపర్-12 దశలో భాగంగా జరుగుతున్న ఈ గ్రూప్-1 మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. 

ఓపెనర్ అలెక్స్ హేల్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడడంతో ఇంగ్లండ్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. 11 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ 1 వికెట్ కోల్పోయి 85 పరుగులు చేసింది. హేల్స్ 40 బంతుల్లో 52 పరుగులు చేసి శాంట్నర్ బౌలింగ్ లో అవుటయ్యాడు. అతడి స్కోరులో 7 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. ప్రస్తుతం కెప్టెన్ జోస్ బట్లర్ 29 పరుగులతో ఆడుతున్నాడు. మొయిన్ అలీ 2 పరుగులతో ఆడుతున్నాడు.
Go Back to Shorts
England
New Zealand
Brisbane
T20 World Cup

More Telugu News