క్రికెటర్ జహీర్ ఖాన్ రెస్టారెంట్ ఉన్న భవనంలో అగ్నిప్రమాదం.. వీడియో ఇదిగో
- పూణెలో ఉన్న భవనం ఏడో అంతస్తులో చెలరేగిన మంటలు
- ప్రమాద సమయంలో ఎవ్వరూ లేకపోవడంతో తప్పిన ప్రాణ నష్టం
- మంటలను ఆర్పివేసిన అగ్నిమాపక సిబ్బంది
ఏడు అంతస్తుల భవనంలోని పై ఫ్లోర్లో మంటలు, దట్టమైన పొగ కమ్ముకోవడాన్ని కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి, మంటలను అందుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదం కారణంగా ఇప్పటిదాకా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. ఆస్తి నష్టంపై అంచనా వేయాల్సి ఉంది. కాగా, ఈ ప్రమాదం వల్ల గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న జహీర్ ఖాన్ రెస్టారెంటుకు ఏదైనా నష్టం వాటిల్లిందో లేదో తెలియాల్సి ఉంది.