ఈ కష్ట సమయంలో భారత్ కు అండగా ఉంటాం: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
- గుజరాత్ తీగల వంతెన ప్రమాదంపై అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పందన
- సంతాపం వ్యక్తం చేసిన అగ్రరాజ్యం అధినేతలు
- నేడు మోర్బీని సందర్శించనున్న ప్రధాని మోదీ
ఆదివారం సాయంత్రం గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో మచ్చు నదిలో కేబుల్ వంతెన కూలిపోవడంతో 130 మందికి పైగా మరణించారు. పలువురు గాయపడ్డారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కూడా ఈ దుర్ఘటనపై తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి గురించి ఆలోచిస్తున్నానని ఆమె ట్వీట్ చేశారు. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం మోర్బీలో పర్యటించి, వంతెన కూలిన ప్రాంతాన్ని సందర్శించనున్నారు.