Twitter: ట్విట్టర్ ను అమ్మేసి.. కొత్త అప్లికేషన్ పై దృష్టి పెట్టిన జాక్ డోర్సే?

As Musk Takes Over Twitter Jack Dorsey Plans An Alternative

  • బ్లూ స్కై అప్లికేషన్ ను అభివృద్ధి చేసిన జాక్ డోర్సే టీమ్
  • త్వరలోనే బీటా టెస్టింగ్
  • సమస్యలను సరిచేసిన తర్వాత ప్రారంభం

ట్విట్టర్ ను దాని వ్యవస్థాపకులు భారీ మొత్తానికి ఎలాన్ మస్క్ కు విక్రయించేశారు. సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన జాక్ డోర్సే ఇప్పుడు మరో సామాజిక మాధ్యమ అస్త్రాన్ని సిద్ధం చేసే పనిలో ఉన్నారు. కొత్త సోషల్ మీడియా అప్లికేషన్ ను త్వరలోనే ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నారు. తన డీసెంట్రలైజ్డ్ ‘బ్లూ స్కై’ సోషల్ యాప్ బీటా పరీక్షలకు వెళ్లనున్నట్టు జాక్ డోర్సే వారం క్రితమే ప్రకటించారు. 

‘‘ప్రొటోకాల్ టెస్టింగ్ ను త్వరలోనే ప్రారంభించనున్నాం. డిస్ట్రిబ్యూటెడ్ ప్రొటోకాల్ అభివృద్ధి అనేది ఎంతో సంక్లిష్టమైన ప్రక్రియ. ఎందరో భాగస్వాముల నుంచి సమన్వయం అవసరం. ఒక్కసారి నెట్ వర్క్ ను ప్రారంభించామంటే, అప్పుడు ప్రైవేటు బీటా మొదలుపెట్టి, సమస్యలను సరిచేస్తాం’’ అని జాక్ డోర్సే నుంచి ప్రకటన వెలువడింది. నూతన సోషల్ నెట్ వర్క్ అన్నది ఒక సైట్ కాకుండా ఒకటికి మించిన వెబ్ సైట్లతో నడవనుంది.

Twitter
FOUNDER
Jack Dorsey
ready for
New social media application
beta testing
blue sky
  • Loading...

More Telugu News