Shabbir Ali: కేసీఆర్ డైరెక్షన్ లోనే మొత్తం డ్రామా జరిగింది: షబ్బీర్ అలీ

Total drama performed in KCR direction says Shabbir Ali
  • టీఆర్ఎస్, బీజేపీ రెండూ దొంగ పార్టీలేనన్న షబ్బీర్ అలీ 
  • కేసీఆర్ ఇప్పటి వరకు 33 మంది ఎమ్మెల్యేలను కొన్నారని వ్యాఖ్య 
  • రాహుల్ యాత్రకు మైలేజీ లేకుండా చేయడానికే ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామా అన్న షబ్బీర్ 
మొయినాబాద్ ఫాం హౌస్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ యత్నించిందనే వార్త కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ స్పందిస్తూ... ముఖ్యమంత్రి కేసీఆర్ డైరెక్షన్ లోనే ఇదంతా జరిగిందని ఆరోపించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫాంహౌస్ లో మంచి డ్రామా ప్లే చేశారని చెప్పారు. 

టీఆర్ఎస్, బీజేపీ రెండూ దొంగ పార్టీలేనని షబ్బీర్ అలీ అన్నారు. దేశ వ్యాప్తంగా ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నాలను బీజేపీ చేస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తక్కువేమీ కాదని... ఇప్పటి వరకు ఆయన 33 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని చెప్పారు. నేరం జరిగినప్పుడు సదరు ఎమ్మెల్యేలను పిలిచి విచారించాలని... అది చేయకుండా వారిని ప్రగతి భవన్ కు ఎలా తీసుకెళ్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు పెద్ద ఎత్తున ప్రజల మద్దతు లభిస్తోందని... అందుకే ఈ యాత్రకు మైలేజీ లేకుండా చూసేందుకు రెండు పార్టీలు కలిసి ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామా ఆడించాయని దుయ్యబట్టారు.
Shabbir Ali
Rahul Gandhi
Congress
Bharat Jodo Yatra
KCR
TRS

More Telugu News