భార్యపైకి కారును ఎక్కించడానికి ప్రయత్నించిన బాలీవుడ్ నిర్మాత అరెస్ట్

  • ముంబైలో గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • హత్యాయత్నం కేసు నమోదు
  • కారును భార్య అడ్డగించబోగా జరిగిన ఘటన
నిర్దాక్షిణ్యంగా భార్యపై కారు ఎక్కించిన బాలీవుడ్ సినీ నిర్మాత కమల్ కిషోర్ మిశ్రాను ముంబై పోలీసులు గురువారం రాత్రి అరెస్ట్ చేశారు. హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. కిషోర్ భార్య యస్మీన్ (35) కారును అడ్డగించబోగా, కమల్ కిషోర్ కారును ఆమెపైకి పోనివ్వడానికి ప్రయత్నించగా.. ఆమెకు గాయాలైన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో గత వారం సామాజిక మాధ్యమాల్లో వెలుగు చూసింది. 

ఈ ఘటనలో కమల్ కిశోర్ భార్య యస్మీన్ కాలికి గాయాలయ్యాయి. కమల్ కిశోర్ ఓ మోడల్ తో కారులో ఉండడంతో యస్మీన్ అడ్డుకునే ప్రయత్నం చేసింది. తన భర్త వివాహేతర సంబంధంలో ఉన్నాడని, అక్కడి నుంచి తప్పించుకునేందుకు కారును వేగంగా ముందుకు పోనిచ్చాడంటూ యస్మీన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దేహతి డిస్కో, భూటియాప, ఫ్లాట్ నంబర్ 420, ఖల్లి బల్లి, శర్మాజీ కి లగ్ గయ్ చిత్రాలకు సహ నిర్మాతగా కమల్ కిశోర్ వ్యవహరించారు. 


Film producer
Kamal Kishore
arrested
mumbai police

More Telugu News