అధికారిక భవంతిని కాదని చిన్న ఫ్లాట్ కు వెళ్తున్న రిషి సునాక్
- డౌనింగ్ స్ట్రీట్‌లో మరో ఫ్లాట్ కోరిన వైనం
- చాన్స్ లర్ గా గతంలో ఆ ఫ్లాట్ లో సంతోషంగా ఉన్నట్టు వెల్లడి
- బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేబట్టిన సునాక్
మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు ఛాన్సలర్‌గా ఉన్నప్పుడు సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తి, ఇద్దరు కుమార్తెలతో కలిసి చిన్న ఫ్లాట్‌లో ఉన్నారు. ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రధానులు ఛాన్సలర్ కోసం కేటాయించిన నంబర్ 11 పైన ఉన్న పెద్ద ఫ్లాట్‌లో నివసిస్తున్నారు. ఇందులో నాలుగు బెడ్ రూములు ఉంటాయి. భవంతి చాలా విశాలంగా ఉంటుంది. కానీ, సునాక్ మాత్రం మూడు బెడ్ రూములు ఉన్న చిన్న ఫ్లాట్ ఎంచుకున్నారు. ఎందుకని ఈ నిర్ణయం తీసుకున్నారని డౌనింగ్ స్ట్రీట్ ప్రతినిధి అడిగినప్పుడు, గతంలో తాము అక్కడ చాలా సంతోషంగా ఉన్నామని ప్రధాని చెప్పారు. డౌనింగ్ స్ట్రీట్ లోపల నివాస ప్రాంతాలు, బయటికి కనిపించకుండా కాస్త దూరంగా ఉంటాయి.