టీ పొడి అనుకుని పిచికారీ మందుతో టీ తయారు చేసిన ఇల్లాలు.. ఐదుగురి మృతి
- ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురిలో ఘటన
- వరిపంటలో పిచికారీ చేసే మందును టీపొడిగా భావించిన మహిళ
- భర్త, ఇద్దరు కుమారులు, మామ, పొరిగింటి వ్యక్తి మృతి
సోబ్రాన్, శివానంద్ల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని అక్కడి నుంచి సైఫాయి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వారిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. శివానంద్ భార్య టీ కాస్తున్న సమయంలో వరిపంటలో పిచికారీ చేసే మందును టీపొడిగా భావించి పాలలో కలిపి టీ తయారు చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పాలలో కలిపిన పిచికారీ మందు విషపూరితం కావడంతో అది తాగిన వారు మరణించినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.