విదేశీయుడిని పెళ్లాడబోతున్న హీరోయిన్ నిఖీషా పటేల్.. కాబోయే భర్త ఫొటో ఇదిగో!
- 'కొమురం పులి' సినిమాలో పవన్ సరసన నటించిన నిఖీషా
- త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు వెల్లడి
- ప్రియుడితో ఉన్న ఫొటోను షేర్ చేసిన వైనం
అయితే, సోషల్ మీడియా ద్వారా ఆమె అభిమానులతో టచ్ లోనే ఉంది. తాజాగా దీపావళి సందర్భంగా ఆమె ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. తాను ఒక విదేశీయుడుతో ప్రేమలో ఉన్నానని... త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నానని తెలిపింది. అంతేకాదు... తనకు కాబోయే భర్తను అభిమానులకు పరిచయం చేసింది. ఆయనతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసింది. అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపింది.