హైదరాబాద్‌లో టపాసులు పేలుస్తూ గాయపడిన 24 మంది.. ఐదుగురి పరిస్థితి విషమం
- దేశవ్యాప్తంగా ఘనంగా దీపావళి వేడుకలు
- గాయపడిన వారిలో ఎక్కువమంది చిన్నారులే
- ఎక్కువమందిలో కంటి సంబంధిత సమస్యలు
- ముగ్గురిని వేరే ఆసుపత్రులకు రెఫర్ చేసిన వైద్యులు
గాయపడిన వారిలో ఎక్కువమంది కంటి సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీరందరూ నగరంలోని సరోజినీదేవి కంటి ఆసుపత్రికి క్యూ కట్టారు. చికిత్స కోసం వచ్చిన వారిలో ఎక్కువమంది చిన్నారులేనని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. వీరిలో 12 మంది చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. అలాగే, గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని, ముగ్గురిని వేరే ఆసుపత్రులకు రెఫర్ చేసినట్టు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి.