నేడే సూర్యగ్రహణం.. ఏ నగరంలో ఎన్ని గంటలకు ప్రారంభం అవుతుందంటే..?
- ఇండియాలో కొన్ని నగరాల్లోనే కనిపించనున్న గ్రహణం
- సాయంత్రం 4.29 గంటలకు గ్రహణం ప్రారంభం
- మన దేశంలో మళ్లీ 2027లో కనిపించనున్న సూర్యగ్రహణం
సూర్యగ్రహణం సాయంత్రం 4.29 గంటల నుంచి 6.26 గంటల వరకు కొనసాగుతుంది. హైదరాబాద్ లో సాయంత్రం 4.59 గంటలకు గ్రహణం ప్రారంభమవుతుంది. ఢిల్లీలో సాయంత్రం 4.29, కోల్ కతాలో 4.52, చెన్నైలో 5.14, ముంబైలో 4.49, ద్వారకలో 4.36, తిరువనంతపురంలో 5.29, నాగ్ పూర్ లో 4.49 గంటలకు గ్రహణం ప్రారంభమవుతుంది. మరోవైపు, గ్రహణాన్ని నేరుగా కంటితో చూడటం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.