కోమటిరెడ్డికి వ్యతిరేకంగా మునుగోడులో 18 థౌజండ్ వాలా పేల్చిన యువకులు
- బీజేపీతో రూ. 18 వేల కోట్ల కాంట్రాక్టులు కోమటిరెడ్డి తీసుకున్నాడంటూ ఆరోపణలు
- చౌటుప్పల్ లో 18 థౌజండ్ వాలా పేల్చిన యువకులు
- కోమటిరెడ్డికి బుద్ధి చెపుతామని నినాదాలు
ఈ నేపథ్యంలో చౌటుప్పల్ కు చెందిన కొందరు యువకులు టపాసులు పేల్చారు. మనుగోడు ఆత్మగౌరవాన్ని కోమటిరెడ్డి ఢిల్లీలో తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికలో కోమటిరెడ్డికి తగిన బుద్ధి చెపుతామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు.