బిర్యానీ తింటే లైంగిక పటుత్వం తగ్గుతుందంటూ బిర్యానీ సెంటర్లను బలవంతంగా మూయించిన మాజీ మంత్రి
- బెంగాల్ లోని కూచ్ బెహార్ లో రెండు బిర్యానీ సెంటర్లను
మూసివేయాలని బలవంతం - బిర్యానీలో వాడే మసాలాలతో పురుషుల్లో పటుత్వం తగ్గుతుందంటున్న టీఎంసీ నాయకుడు
- ఈ మేరకు కొంత మంది ఫిర్యాదు చేశారని వ్యాఖ్య
‘బిర్యానీ చేయడానికి ఏ మసాలాలు ఉపయోగిస్తున్నారో తమకు తెలియదని ఈ ప్రాంత ప్రజలు కొన్నాళ్ల నుంచి చెబుతున్నారు. వాటివల్ల పురుషుల్లో లైంగిక సామర్థ్యం తగ్గుతోందని ఆరోపిస్తున్నారు’ అని ఆయన తెలిపారు. బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు ఈ ప్రాంతంలో బిర్యానీ విక్రయిస్తున్నారని, లైసెన్సు లేకుండా దుకాణాలు నిర్వహిస్తున్నారని కూచ్ బెహార్ మున్సిపాలిటీ చైర్మన్ అయిన రవీంద్రనాథ్ తెలిపారు. ఫిర్యాదుల అనంతరం ఇక్కడికి వచ్చి చూడగా షాపులకు ట్రేడ్ లైసెన్స్ లేదని, అందుకే దుకాణాలు మూసేశామని వెల్లడించారు.