కుప్పంలోని అమెజాన్ గోడౌన్ లో భారీ అగ్నిప్రమాదం

Kuppam Amazon delivery store caught in fire
  • ప్రమాదం జరిగిన సమయంలో గోడౌన్ లో లక్షల విలువైన పార్శిళ్లు
  • షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం!
  • మంటలను ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది
  • రూ.10 లక్షల ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా
చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ కు చెందిన గోడౌన్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగిన సమయంలో గోడౌన్ లో విలువైన పార్శిల్స్ ఉండగా, అవి అగ్నికి ఆహుతైనట్టు తెలుస్తోంది. 

అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న ఫైర్ డిపార్ట్ మెంట్ సిబ్బంది హుటాహుటీన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్టు అనుమానిస్తున్నారు. కాగా, ఈ అగ్నిప్రమాదంలో రూ.10 లక్షల ఆస్తి నష్టం జరిగినట్టు గోడౌన్ సిబ్బంది వెల్లడించారు.
Go Back to Shorts
Amazon
Delivery Store
Fire Accident
Kuppam
Chittoor District

More Telugu News