టీడీపీతో పొత్తు లేదు... కన్నా వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోవడం లేదు: సునీల్ దేవ్ ధర్
- గతంలో టీడీపీ పొత్తుతో చేదు అనుభవాలన్న దేవ్ ధర్
- వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి బీజేపీ పోటీ చేస్తుందని వెల్లడి
- పవన్ కల్యాణ్ అడిగిన రోడ్ మ్యాప్ పై అంతర్గతంగా చర్చించుకుంటామని వివరణ
ఇక ఏపీ బీజేపీలో రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విఫలమయ్యారంటూ ఆ పార్టీ కీలక నేత కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలపైనా దేవ్ ధర్ స్పందించారు. కన్నా వ్యాఖ్యలను తామేమీ అంత సీరియస్ గా తీసుకోవడం లేదన్నారు. పార్టీలో ఈ తరహా అసంతృప్తులు సహజమేనని, అవేమీ అంత పెద్దగా పట్టించుకునే వ్యాఖ్యలు కూడా కాదన్నారు. ఇక జనసేనాని పవన్ కల్యాణ్ అడిగిన రోడ్ మ్యాప్ అందజేతపై అంతర్గతంగా చర్చించుకుంటామని దేవ్ ధర్ తెలిపారు.