Jaqueline Fernandez: జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు కోర్టులో స్వల్ప ఊరట

Jaqueline Fernandez bail extended
  • సుఖేశ్ చంద్రశేఖర్ నుంచి రూ. 7 కోట్ల బహుమతులు అందుకున్నట్టు కేసు
  • ప్రస్తుతం తాత్కాలిక బెయిల్ పై ఉన్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్
  • బెయిల్ ను వచ్చే నెల 10 వరకు పొడిగించిన కోర్టు
ప్రముఖ బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఆమె బెయిల్ ను కోర్టు వచ్చే నెల 10వ తేదీ వరకు పొడిగించింది. సుఖేశ్ చంద్రశేఖర్ అనే వ్యక్తి నుంచి జాక్వెలిన్ రూ. 7 కోట్ల విలువైన వస్తువులను బహుమతులుగా అందుకున్నారనే కేసులో ఆమె విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. 

ప్రస్తుతం ఆమె తాత్కాలిక బెయిల్ పై బయట ఉన్నారు. బెయిల్ ముగుస్తున్న నేపథ్యంలో ఆమె తన లాయర్ ప్రశాంత్ పాటిల్ తో కలిసి కోర్టుకు హాజరయ్యారు. పిటిషన్ ను విచారించిన కోర్టు... రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ను వచ్చే నెల 10వ తేదీన విచారిస్తామని... అప్పటి వరకు తాత్కాలిక బెయిల్ ను పొడిగిస్తున్నట్టు కోర్టు తెలిపింది. దీంతో ఆమెకు స్వల్ప ఊరట లభించినట్టయింది.
Jaqueline Fernandez
Bollywood
Bail

More Telugu News