ఎనిమిది మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వస్తున్నారు: రఘునందన్ రావు
- ఢిల్లీలో కాంగ్రెస్ నేతలతో కేసీఆర్ చర్చలు జరిపారన్న రఘునందన్
- తనపై దుష్ప్రచారం చేసిన వారిపై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరిక
- బీజేపీలోకి టీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున చేరబోతున్నారు
తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన వాళ్లపై పరువునష్టం దావా వేస్తానని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలోకి పెద్ద ఎత్తున వలసలు ఉండబోతున్నాయని చెప్పారు. రంగారెడ్డి, కరీంనగర్, నల్గొండ, వరంగల్ జిల్లాల నుంచి ఇద్దరు చొప్పున టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి రాబోతున్నారని తెలిపారు. మునుగోడు ఎన్నికల తర్వాత ఈ చేరికలు ఉంటాయని అన్నారు.