Munugode: మునుగోడు కొత్త రిటర్నింగ్ అధికారిగా మిర్యాలగూడ ఆర్డీఓ రోహిత్ సింగ్

  • మునుగోడు ఎన్నికల్లో రోడ్డు రోలర్ గుర్తుపై వివాదం
  • రోడ్డు రోలర్ గుర్తును పునరుద్ధరించిన ఎన్నికల సంఘం
  • గుర్తును తొలగించిన రిటర్నింగ్ అధికారిపై వేటు
  • నూతన రిటర్నింగ్ అధికారిగా మిర్యాలగూడ ఆర్డీఓ నియామకం
miryalaguda rdo rohit singh is munugode new returning officer

మునుగోడు ఉప ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా మిర్యాలగూడ ఆర్డీఓగా పనిచేస్తున్న రోహిత్ సింగ్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం మధ్యాహ్నం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. రోడ్డు రోలర్ గుర్తు తొలగింపునకు సంబంధించి నెలకొన్న వివాదంలో గురువారం వెంటవెంటనే చర్యలు చేపట్టిన కేంద్ర ఎన్నికల సంఘం అప్పటిదాకా రిటర్నింగ్ అధికారిగా పనిచేసిన అధికారిని ఆ బాధ్యతల నుంచి తప్పించింది. ఈ క్రమంలో తమ ప్రతినిధిని నేరుగా మునుగోడు పంపి వాస్తవ పరిస్థితులపై ఆరా తీసింది.


ఎన్నికల సంఘం ప్రతినిధి పంపిన నివేదిక ఆధారంగా ఈసీ వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంది. తొలగింపునకు గురైన రోడ్డు రోలర్ గుర్తును పునరుద్ధరించింది. అంతేకాకుండా ఆ గుర్తును తొలగించిన రిటర్నింగ్ అధికారిపై వేటు వేసింది. ఆ వెంటనే కొత్త రిటర్నింగ్ అధికారి ఎంపిక కోసం ముగ్గురు అధికారుల పేర్లను సూచించాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈఓ)ని కోరింది. సీఈఓ పంపిన జాబితాను పరిశీలించిన ఈసీ... మిర్యాలగూడ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీఓ)గా పనిచేస్తున్న రోహిత్ సింగ్ ను మునుగోడు నూతన రిటర్నింగ్ అధికారిగా నియమించింది.

More Telugu News