TRS: మీ హామీలు ఏమయ్యాయి నడ్డాజీ?: హరీశ్ రావు

  • మునుగోడు ప్రచారానికి వెళ్లిన హరీశ్ రావు
  • 2016లో మర్రిగూడలో జేపీ నడ్డా పర్యటనను ప్రస్తావించిన తెలంగాణ మంత్రి
  • ఫ్లోరైడ్ రిసెర్చి అండ్ మిటిగేషన్ సెంటర్ ను ఏర్పాటు చేస్తామన్న నడ్డా హామీని గుర్తు చేసిన వైనం
  • నడ్డా హామీకి ఆరేళ్లు నిండినా కేంద్రం నయాపైసా ఇవ్వలేదని ఆరోపణ
  • మునుగోడులో బీజేపీ నేతలకు ప్రజలు బుద్ధి చెబుతారని జోస్యం
ts minister harish rao fires on bjp leaders

మునుగోడు ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం తెలంగాణ మంత్రి హరీశ్ రావు బీజేపీ నేతలను ఉద్దేశించి విమర్శలు సంధించారు. గతంలో కేంద్ర మంత్రి హోదాలో ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇచ్చిన హామీని ప్రస్తావించిన హరీశ్ రావు మీ హామీలు ఏమయ్యాయి నడ్డాజీ...? అంటూ విమర్శలు గుప్పించారు. 2016లో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హోదాలో జేపీ నడ్డా మునుగోడు పరిధిలోని మర్రిగూడలో పర్యటించిన విషయాన్ని ఈ సందర్భంగా హరీశ్ రావు గుర్తు చేశారు. 

నాటి పర్యటనలో భాగంగా ఫ్లోరైడ్ రిసెర్చి అండ్ మిటిగేషన్ సెంటర్ ను ఏర్పాటు చేస్తామని జేపీ నడ్డా చెప్పారని హరీశ్ రావు గుర్తు చేశారు. జేపీ నడ్డా ఇచ్చిన హామీకి అప్పుడే ఆరేళ్లు నిండాయన్న హరీశ్... ఆ సెంటర్ ఏర్పాటు కోసం తెలంగాణ సర్కారు 8.2 ఎకరాల స్థలాన్ని చౌటుప్పల్ లో కేటాయించిందని తెలిపారు. జేపీ నడ్డా హామీకి ఆరేళ్లు నిండినా ఆ కేంద్రానికి కేంద్రం నయాపైసా ఇవ్వలేదన్నారు. మర్రిగూడలో 300 పడకల ఆసుపత్రి నిర్మిస్తామని కూడా హామీ ఇచ్చారన్నారు. అబద్ధపు హామీలిస్తూ ప్రజా గోడు పట్టని బీజేపీ నేతలు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి మునుగోడు వస్తారని ఆయన ప్రశ్నించారు. ప్రజలు ఈ ఎన్నికల్లో బీజేపీ నేతలకు బుద్ధి చెప్పడం ఖాయమని కూడా హరీశ్ అన్నారు.

More Telugu News