రికార్డు స్థాయికి రూపాయి పతనం
- ట్రేడింగ్లో పడుతూ లేస్తున్న రూపాయి
- ఆల్ టైం రికార్డు స్థాయికి పడిపోయిన రూపాయి మారకం విలువ
- చరిత్రలోనే తొలిసారి 83.02కు పడిపోయిన వైనం
బుధవారం సెషన్ ఆరంభంలో రూపాయి సానుకూలంగానే ట్రేడ్ అయింది. అయితే, ఆ తర్వాత క్రమంగా నష్టాల్లోకి జారుకుంది. ఇది మరింత పతనమై 83.50 దిగువకు చేరుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆయిల్ కార్పొరేషన్ కంపెనీలు, రిజర్వు బ్యాంకు డాలర్లను కొనుగోలు చేయడంతో రూపాయి విలువ తగ్గిందని బ్యాంకర్లు చెబుతున్నారు. రూపాయి పతనం కొనసాగుతుండడంతో ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు వడ్డీరేట్లను పెంచడంపై భారతీయ రిజర్వు బ్యాంకు దృష్టి సారించే అవకాశం ఉందని చెబుతున్నారు.