Vijay: దీపావళికి 'వారసుడు' ఫస్టు సింగిల్!

  • విజయ్ హీరోగా రూపొందుతున్న 'వారసుడు' 
  • ఫస్టు టైమ్ ఆయన జోడీ కడుతున్న రష్మిక
  • హైలైట్ గా నిలవనున్న తమన్ సంగీతం
  • దీపావళికి ఫస్టు సింగిల్ రిలీజ్  
  • సంక్రాంతికి సినిమా విడుదల
Varasudu Movie Update

విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి 'వారసుడు' సినిమాను రూపొందిస్తున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా నిర్మితమవుతోంది. తెలుగుతో పాటు తమిళంలో ఏక కాలంలో ఈ సినిమా చిత్రీకరణను జరుపుకుంటోంది. తమిళంలో ఈ సినిమాకి 'వరిసు' అనే టైటిల్ ను ఖరారు చేశారు. విజయ్ జోడీగా ఫస్టు టైమ్ రష్మిక అలరించనుంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. 

విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా నడవనుంది. తమన్ స్వరపరిచిన పాటలు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నట్టుగా ఇంతకుముందే చెప్పారు. మరి దీపావళికి ఈ సినిమా నుంచి ఏదైనా అప్ డేట్ ఇస్తారా అనే ఆసక్తి అభిమానులలో నెలకొంది. దీపావళికి ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ వదలనున్నారనేది సమాచారం.

శివకార్తికేయ 'ప్రిన్స్' ప్రీ రిలీజ్ ఈవెంటులో తమన్ 'వారసుడు' గురించి ప్రస్తావించాడు. దీపావళికి ఫస్టు సింగిల్ రిలీజ్ కానున్నట్టు చెప్పాడు. 'బీస్ట్' తరువాత విజయ్ నుంచి వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఆ అంచనాలకి ఎంత దగ్గరగా ఈ సినిమాను వంశీ పైడిపల్లి తీసుకుని వెళతాడనేది చూడాలి.

More Telugu News