YSRCP: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన సీబీఐ

  • వివేకా కేసును ఏపీ బయట విచారించాలంటూ సునీతా రెడ్డి పిటిషన్
  • రేపు ఈ పిటిషన్ పై విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు
  • కోర్టు ఆదేశాల మేరకు కౌంటర్ దాఖలు చేసిన సీబీఐ
  • నిందితులు, స్థానిక పోలీసులు కుమ్మక్కయ్యారని ఆరోపణ
cbi files counter on ys sunitha reddy petition in supreme court

వైసీపీ నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ఏపీ బయట విచారణ జరిగేలా ఆదేశాలు జారీ చేయాలన్న పిటిషన్ పై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టనుంది. వివేకా కూతురు సునీతా రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై తదుపరి విచారణ బుధవారం ఉన్న నేపథ్యంలో ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ మంగళవారం కోర్టులో తన కౌంటర్ ను దాఖలు చేసింది. ఈ కౌంటర్ లో సీబీఐ అధికారులు పలు సంచలన విషయాలను ప్రస్తావించారు.

వివేకా హత్య కేసును ఏపీ బయట విచారించాలని దాఖలు చేసిన పిటిషన్ లో సునీతారెడ్డి చెప్పిన విషయాలన్నీ వాస్తవాలేనని సీబీఐ తన కౌంటర్ లో పేర్కొంది. ఏపీ పోలీసులు నిందితులతో కుమ్మక్కయ్యారని, ఈ కారణంగానే కేసు దర్యాప్తులో తీవ్ర జాప్యం జరుగుతోందని తెలిపింది. నిందితులు చెప్పినట్లు స్థానిక పోలీసులు వ్యవహరించారని చెప్పింది. ఈ కేసును విచారిస్తున్న అధికారిపైనే స్థానిక నిందితులు కేసు పెట్టారని పేర్కొంది. తాము చెప్పినట్లుగా స్టేట్ మెంట్ ఇస్తానన్న అధికారి శంకరయ్యకు ప్రమోషన్ ఇచ్చారని తెలిపింది.

More Telugu News