పాకిస్థాన్ ను ఓడిస్తే టీ20 ప్రపంచ కప్ మనదే: సురేశ్ రైనా
- ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్
- ఈ నెల 23న భారత్, పాక్ ల మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్
- టీమిండియా అద్భుతమైన ఫామ్ లో ఉందన్న రైనా
పాకిస్థాన్ తో తలపడే తొలి మ్యాచ్ లో గెలిస్తే టీ20 వరల్డ్ కప్ మనదే అని సురేశ్ రైనా చెప్పాడు. ప్రస్తుతం టీమిండియా అద్భుతమైన ఫామ్ లో ఉందని... షమీ, అర్షదీప్ సింగ్, సూర్యకుమార్ యాదవ్ మనకు ఉన్నారని తెలిపాడు. కోహ్లీ భీకర ఫామ్ లో ఉన్నాడని... రోహిత్ శర్మ సమర్థవంతమైన కెప్టెన్ అని చెప్పారు. పాక్ తో జరిగే తొలి మ్యాచ్ లో గెలిస్తే... మన టీమ్ విశ్వాసం అమాంతం పెరుగుతుందని అన్నాడు. దేశంలోని ప్రతి ఒక్కరూ టీమ్ గెలుపు కోసం ప్రార్థనలు చేస్తున్నారని... ఈ ప్రపంచ కప్ ను టీమిండియా తప్పకుండా గెలవాలని తాను కూడా గట్టిగా కోరుకుంటున్నానని చెప్పాడు.