జనసేన కార్యకర్తలకు తోక ఒకటే తక్కువ: మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
- విజయవాడలో విలేకరులతో మాట్లాడిన మంత్రి
- గొడవలు జరుగుతాయని తెలిసినప్పుడు పవన్ వైజాగ్ రావడాన్ని వాయిదా వేసుకుని ఉండాల్సిందన్న కారుమూరి
- జనసేన కార్యకర్తల దాడిలో రోజా తలపగిలి ఉండేదని ఆవేదన
జనసేన కార్యకర్తలకు తోక ఒకటే తక్కువన్న ఆయన.. ఈ తోకలేని కోతులు పవన్‌నే వాహనం నుంచి కింద పడేశాయని అన్నారు. విశాఖ విమానాశ్రయం వద్ద కర్రలు, రాడ్లతో దుర్మార్గంగా దాడిచేశారని అన్నారు. వారి దాడిలో మంత్రి రోజా తలపగిలి ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు.