విశాఖ గర్జన విజయవంతం కావడంతో చంద్రబాబు, పవన్ తట్టుకోలేకపోతున్నారు: మంత్రి పెద్దిరెడ్డి

  • విశాఖలో అక్టోబరు 15న వైసీపీ గర్జన
  • గర్జన సక్సెస్ అయిందని మంత్రి పెద్దిరెడ్డి వెల్లడి
  • చంద్రబాబు వెన్నులో వణుకు పుడుతోందని వ్యాఖ్యలు
  • బాబు డైరెక్షన్ లో పవన్ నడుస్తున్నాడని విమర్శలు
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ లపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. వైసీపీ నిర్వహించిన విశాఖ గర్జన కార్యక్రమం విజయవంతం కావడంతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. గర్జన సక్సెస్ తో చంద్రబాబు వెన్నులో వణుకు పుడుతోందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు డైరెక్షన్ లోనే పవన్ నడుస్తున్నాడని స్పష్టం చేశారు. 

అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించిన వ్యక్తి చంద్రబాబు అని, చంద్రబాబు పాలనలో పోలీసులను హీనంగా చూశారని పెద్దిరెడ్డి తెలిపారు. ఇప్పుడు సీఎం జగన్ పాలనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అరాచకపాలన గురించి అందరికీ తెలుసని అన్నారు. ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు అన్ని ప్రాంతాల ప్రజలు మద్దతు పలుకుతున్నారని మంత్రి పెద్దిరెడ్డి వెల్లడించారు.

Peddireddi Ramachandra Reddy
Chandrababu
Pawan Kalyan
Visakha Garjana
YSRCP
Three Capitals
Andhra Pradesh

More Telugu News