స్విగ్గీలో ఉద్యోగం తెచ్చుకున్న తండ్రి, పట్టరాని సంతోషంలో కూతురు.. వీడియో వైరల్
- కళ్లు మూసుకున్న కూతురు ముందుకు స్విగ్గీ టీషర్ట్ తో వచ్చిన తండ్రి
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
- తండ్రీకూతుళ్ల స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనం అని కామెంట్లు
హృదయాన్ని హత్తుకునే ఈ క్లిప్‌లో ఒక చిన్న అమ్మాయి తన చేతులతో కళ్లు మూసుకోగా.. ఆమె తండ్రి స్విగ్గీ టీ-షర్ట్‌తో తన ముందుకొచ్చాడు. కళ్లు తెరిచిన ఈ చిన్నారి తన తండ్రికి స్విగ్గీలో కొత్త ఉద్యోగం వచ్చిందని గ్రహించింది. అంతే.. ఆనందంతో ఎగిరి గంతులేసింది. పట్టరాని సంతోషంతో తండ్రిని హత్తుకుంది. ఆన్లైన్లో షేర్ చేసిన తర్వాత ఈ వీడియోకు మిలియన్ వ్యూస్ లభించాయి. అమ్మాయి రియాక్షన్ చూసి నెటిజన్లు సైతం చాలా సంతోషం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.