పశ్చిమ బెంగాల్లో రూ. 30 కోట్ల విలువైన రెండున్నర కేజీల పాము విషం పట్టివేత
- బంగ్లాదేశ్ మీదుగా భారత్‌లోకి..
- నేపాల్ మీదుగా చైనాకు తరలిస్తుండగా పట్టివేత
- 35 రోజుల్లో రెండోసారి పట్టుబడిన వైనం
నిందితుడిని ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాకు చెందిన మహ్మద్ సరాఫత్‌గా గుర్తించారు. పాము విషాన్ని చైనాకు తరలిస్తున్నట్టు విచారణలో అతడు పేర్కొన్నాడు. విషం బంగ్లాదేశ్ మీదుగా భారత్‌లోకి వచ్చిందని, ఇక్కడి నుంచి దానిని నేపాల్‌కు తరలించి అక్కడి నుంచి చైనాకు తీసుకెళ్లనున్నట్టు చెప్పాడు. అంతర్జాతీయ మార్కెట్లో పాము విషానికి విపరీతమైన డిమాండ్ ఉందని, పట్టుబడిన పాము విషం రూ. 30 కోట్ల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. కాగా, పశ్చిమ బెంగాల్లో పాము విషాన్ని స్వాధీనం చేసుకోవడం 35 రోజుల్లో ఇది రెండోసారి. సెప్టెంబరు 10న జల్పాయ్గురి జిల్లాలో రూ. 13 కోట్ల విలువైన పాము విషాన్ని స్వాధీనం చేసుకున్నారు.