icc: టీ20 వరల్డ్ కప్ లో రిజర్వ్ డే అమలు చేస్తారిలా..

  • సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్ కు రిజర్వ్ డేస్ కేటాయించిన ఐసీసీ
  • కనీసం ఐదు ఓవర్ల మ్యాచ్ సాధ్యం కాకపోతే రిజర్వ్ డే అమలు
  • తొలి దశ, సూపర్12 రౌండ్లలో మ్యాచ్ లు రద్దయితే ఇరు జట్లకు ఒక్కో పాయింట్
What Is The Reserve Day Rule For T20 World Cup 2022

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టీ20 ప్రపంచ కప్ ఆదివారం మొదలైంది. తొలి మ్యాచ్ లోనే మాజీ విజేత శ్రీలంకను ఓడించిన నమీబియా సంచలనం సృష్టించింది. ఈ టోర్నీలో మొదట తొలి రౌండ్ మ్యాచ్ లు ఉంటాయి. శనివారం నుంచి 12 జట్లతో సూపర్12 రౌండ్ మొదలవుతుంది. ఈ టోర్నీ కోసం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ 'రిజర్వ్ డే'ని  చేర్చింది. వర్షం లేదా ఇతర కారణాలతో మ్యాచ్ లకు ఆటంకం కలిగితే రిజర్వే రోజు వాటిని నిర్వహిస్తారు. అయితే, ఈ అవకాశం సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్ కు మాత్రమే అందుబాటులో ఉంటుంది.  పెద్ద టోర్నీ కోసం ఐసీసీ రిజర్వ్ డే ఉంచడం ఇదే తొలిసారి కాదు. 2019 వన్డే వరల్డ్ కప్ లో అమలు చేశారు. 

 సెమీ ఫైనల్, ఫైనల్ ను షెడ్యూల్ తేదీల్లో ప్రతి జట్టుకు కనీసం 5 ఓవర్లు సాధ్యం కాకపోతే మాత్రమే రిజర్వ్ డే ను ఉపయోగిస్తారు. ఆటకు వర్షం అంతరాయం కలిగిస్తే.. కనీసం ఐదేసి ఓవర్లకు కుదించి మ్యాచ్‌ని నిర్వహించి ఫలితం రాబట్టే ప్రయత్నం చేస్తారు. అది కూడా సాధ్యం కాకపోతేనే రిజర్వ్ డేను ఉపయోగిస్తారు. ముందు రోజు మ్యాచ్ ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి కొనసాగిస్తారు. కాగా, ప్రపంచ కప్ సెమీ ఫైనల్స్ వరుసగా నవంబర్ 9, 10వ తేదీల్లో,  ఫైనల్ ను నవంబర్ 13వ తేదీన షెడ్యూల్ చేశారు. కాగా, తొలి రౌండ్, సూపర్12 రౌండ్ మ్యాచ్ ల్లో వర్షం వల్ల మ్యాచ్ లు రద్దయితే ఇరు జట్లకు ఒక్కో పాయింట్ కేటాయిస్తారు.

More Telugu News