Tollywood: ప్రభాస్ ‘సలార్’ నుంచి కొత్త అప్ డేట్

 First Look Of Prithviraj Sukumaran As Vardharaja Mannaar in Salaar releases
  • పృథ్వీరాజ్ పాత్ర ఫస్ట్ లుక్ విడుదల
  • ‘వర్ధరాజా మన్నార్‌’ పాత్రలో నటిస్తున్న పృథ్వీరాజ్
  • క్రూరంగా, భయంకరంగా ఉన్న ఆయన లుక్
‘రాధేశ్యామ్’ చిత్రంతో తీవ్రంగా నిరుత్సాహ పరిచిన రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న తన తదుపరి చిత్రం ‘సలార్’పై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ‘కేజీఎఫ్’ సిరీస్ తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నీల్ పై  నమ్మకం ఉంచాడు. భారీ బడ్జెట్ తో, ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ ప్యాన్ ఇండియా సినిమాలో శృతిహసన్ హీరోయిన్గా నటిస్తోంది. కోల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ‘సలార్’ చిత్రం షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. తాజాగా సలార్ చిత్రం తాలూకు అదిరిపోయే ఓ ఆసక్తికర అప్ డేట్ ఇచ్చింది. ఇందులో నటిస్తున్న మలయాళ స్టార్ హీరో పృథ్వీ రాజ్ ఫస్ట్ లుక్ ను ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం విడుదల చేసింది. పృథ్వీరాజ్ విలన్ పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. 

ఆయన పాత్రకు ‘వర్ధరాజా మన్నార్‌’ అనే పేరు పెట్టారు. ముక్కు పుడక, చెవికి రింగులు, మెడలో వెండి కడీలు, నుదుటిపై పొడవైన బొట్టుతో ఉన్న పోస్టర్ లో పృథ్వీరాజ్ ముఖంపై గాట్లతో చాలా కోపంగా కనిపిస్తున్నాడు. ఫస్ట్ లుక్ చూస్తుంటే మన్నార్ పాత్ర భయంకరంగా, క్రూరంగా ఉండబోతుందని తెలుస్తోంది. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై ప్రశాంత్‌ నీల్‌ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సెప్టెంబర్‌ 28న విడుదల చేయబోతున్నారు.
Tollywood
Prabhas
salaar
movie
look
pritvhiraj

More Telugu News