కశ్మీరీ పండిట్ ను కాల్చి చంపిన టెర్రరిస్టులు
- షోపియాన్ జిల్లాలో దాడికి తెగబడ్డ ఉగ్రవాదులు
- పురాణ్ కృష్ణన్ అనే కశ్మీరీ పండిట్ ను హత్య చేసిన వైనం
- ముష్కరుల కోసం గాలిస్తున్న బలగాలు
సమాచారం అందిన వెంటనే భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. టెర్రరిస్టుల కోసం గాలిస్తున్నాయి. పురాణ్ కృష్ణన్ కు భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఇంటి నుంచి ఆయన ఎక్కువగా బయటకు వచ్చేవారు కాదని స్థానికులు తెలిపారు. ఎక్కువగా ఇంట్లోనే గడిపే వారని చెప్పారు. ఆయన హత్యతో బంధువులు భయాందోళనలకు గురవుతున్నారు.